Breaking News

పదో తరగతి ఫలితాల్లో హైదరాబాద్ చివరి స్థానం

2026 తెలంగాణ పదో తరగతి (SSC) ఫలితాల్లో హైదరాబాద్ జిల్లా 89.23 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే చివరి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది మొత్తం 95.15% విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.


Published on: 30 Apr 2026 15:46  IST

2026 తెలంగాణ పదో తరగతి (SSC) ఫలితాల్లో హైదరాబాద్ జిల్లా 89.23 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే చివరి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది మొత్తం 95.15% విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.ప్రథమ స్థానం ములుగు జిల్లా 99.30% ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది.ఎప్పటిలాగే బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 96.26%, బాలురు 94.07% ఉత్తీర్ణత సాధించారు.

హైదరాబాద్‌లో మొత్తం 74,099 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, అందులో 66,115 మంది (89.23%) మాత్రమే పాస్ అయ్యారు. ఇక్కడ కూడా బాలికలు (91.4%) బాలుర (86.95%) కంటే మెరుగ్గా రాణించారు.రాష్ట్రవ్యాప్తంగా 5,731 పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించగా, 6 పాఠశాలలు సున్నా శాతం ఉత్తీర్ణతను నమోదు చేశాయి.

 

Follow us on , &

ఇవీ చదవండి