Breaking News

భారీ వర్షం ధాటికి విరిగిన విద్యుత్ స్తంభాలు

ప్రకాశం జిల్లాలో సోమవారం (మే 4, 2026) కురిసిన ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం వల్ల పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గాలివాన బీభత్సం సృష్టించడంతో జనజీవనం స్తంభించిపోయింది.


Published on: 04 May 2026 14:48  IST

ప్రకాశం జిల్లాలో సోమవారం (మే 4, 2026) కురిసిన ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం వల్ల పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గాలివాన బీభత్సం సృష్టించడంతో జనజీవనం స్తంభించిపోయింది.భారీ గాలుల ధాటికి జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీనివల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఒంగోలు: జిల్లా కేంద్రమైన ఒంగోలుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో గంటకు పైగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. పిడుగులు, మెరుపుల శబ్దాలకు నగరం దద్దరిల్లింది.

కనిగిరి: ఇక్కడ ఈదురు గాలుల వల్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలవాలాయి. ఇళ్లపై ఉన్న రేకులు ఎగిరిపోయాయి.

మార్కాపురం: కంభం ప్రాంతంలో అరటి తోటలు నేలకొరిగాయి. ఇక్కడ కూడా విద్యుత్ స్తంభాలు కూలడంతో పాటు ఇళ్లపై రేకులు కిందపడ్డాయి.మధ్యాహ్నం 3 గంటల వరకు 40-43 డిగ్రీల ఎండ ఉన్నప్పటికీ, సాయంత్రం 4 గంటల నుంచి వాతావరణం ఒక్కసారిగా చల్లబడి రాత్రి 8 గంటల సమయంలో గాలివాన తీవ్రరూపం దాల్చింది.

Follow us on , &

ఇవీ చదవండి