Breaking News

2026 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించిన విజయ్ నేతృత్వంలోని TVK పార్టీకి కాంగ్రెస్ పార్టీ అధికారికంగా మద్దతు ప్రకటించింది

తమిళనాడు రాజకీయాల్లో మే 6, 2026న కీలక పరిణామం చోటుచేసుకుంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు (సింగిల్ లార్జెస్ట్ పార్టీ) సాధించిన విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీకి కాంగ్రెస్ పార్టీ అధికారికంగా మద్దతు ప్రకటించింది.

Published on: 06 May 2026 18:56  IST

తమిళనాడు రాజకీయాల్లో మే 6, 2026న కీలక పరిణామం చోటుచేసుకుంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు (సింగిల్ లార్జెస్ట్ పార్టీ) సాధించిన విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీకి కాంగ్రెస్ పార్టీ అధికారికంగా మద్దతు ప్రకటించింది.

దశాబ్ద కాలంగా DMKతో ఉన్న అనుబంధాన్ని తెంచుకుని, కాంగ్రెస్ ఇప్పుడు TVKతో జతకట్టింది.మే 4న వెలువడిన ఫలితాల్లో TVK 108 స్థానాలు సాధించగా, మ్యాజిక్ ఫిగర్ 118కి స్వల్ప దూరంలో నిలిచింది. ఇప్పుడు కాంగ్రెస్ మద్దతుతో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది.

విజయ్ ఇప్పటికే గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి కోరారు.మతతత్వ శక్తులను కూటమిలో చేర్చుకోకూడదనే ప్రధాన షరతుతో కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది.మే 7న చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement