Breaking News

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నా మనోజ్ సిన్హా

జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా 2026 మే 8న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మనోజ్ సిన్హా శుక్రవారం ఉదయం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Published on: 08 May 2026 16:44  IST

జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా 2026 మే 8న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మనోజ్ సిన్హా శుక్రవారం ఉదయం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆయన శ్రీవారికి జరిగిన అత్యంత పురాతనమైన 'అభిషేక సేవ'లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ ఈవో శ్రీ ఎం. రవిచంద్ర మరియు ఆలయ అర్చకులు ఆయనకు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు.

దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందజేశారు.టీటీడీ అధికారులు గవర్నర్‌కు శ్రీవారి తీర్థప్రసాదాలు మరియు స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు.జమ్మూ కాశ్మీర్ ప్రజలు మరియు దేశ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఈ సందర్భంగా ప్రార్థించారు.

Follow us on , &

ఇవీ చదవండి