Breaking News

మహబూబ్‌నగర్లో ఘోర రోడ్డు ప్రమాదం

మహబూబ్‌నగర్ జిల్లాలో 2026 మే 11 (సోమవారం) తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నగర బైపాస్ రోడ్డులోని పాలకొండ జంక్షన్ వద్ద అతివేగంతో వస్తున్న ఒక స్పోర్ట్స్ బైక్ (సుజుకి హయాబుసా), యూటర్న్ తీసుకుంటున్న కారును బలంగా ఢీకొట్టింది.

Published on: 11 May 2026 14:29  IST

మహబూబ్‌నగర్ జిల్లాలో 2026 మే 11 (సోమవారం) తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నగర బైపాస్ రోడ్డులోని పాలకొండ జంక్షన్ వద్ద అతివేగంతో వస్తున్న ఒక స్పోర్ట్స్ బైక్ (సుజుకి హయాబుసా), యూటర్న్ తీసుకుంటున్న కారును బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో మొత్తం ఐదుగురు అక్కడికక్కడే మరణించారు.బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు మృతి చెందారు. వీరిలో ఒకరు హైదరాబాద్‌కు చెందిన యాకూబ్ అఫ్జల్ (25)గా గుర్తించారు.కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు—గౌసియా/అర్షియా బేగం (30), ఆమిర్/ఉమర్ (18 నెలలు), ఉజేఫా (8 ఏళ్లు)—ప్రాణాలు కోల్పోయారు.

ప్రమాద సమయంలో స్పోర్ట్స్ బైక్ దాదాపు 140 కి.మీ. వేగంతో ఉన్నట్లు సమాచారం. వేగం కారణంగా కారు వెనుక భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది.కారులో ఉన్న మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement