Breaking News

లిఫ్ట్‌లో చిక్కుకుని ఐదేళ్ల చిన్నారి మృతి

హైదరాబాద్‌ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌలిదొడ్డిలో లిఫ్ట్‌లో చిక్కుకుని ఐదేళ్ల చిన్నారి బిస్తు ఘోష్‌ (Bistu Ghosh) మృతి చెందింది. ఈ హృదయ విదారక ఘటన బుధవారం (13 మే 2026) మధ్యాహ్నం చోటుచేసుకుంది.


Published on: 13 May 2026 18:13  IST

హైదరాబాద్‌ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌలిదొడ్డిలో లిఫ్ట్లో చిక్కుకుని ఐదేళ్ల చిన్నారి బిస్తు ఘోష్‌ (Bistu Ghosh) మృతి చెందింది. ఈ హృదయ విదారక ఘటన బుధవారం (13 మే 2026) మధ్యాహ్నం చోటుచేసుకుంది.

పశ్చిమ బెంగాల్‌కు చెందిన దంపతులు గౌలిదొడ్డిలోని 'మహి వుమెన్ పీజీ' (మహిళా హాస్టల్‌)లో వంట పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. వారికి ఐదేళ్ల కుమార్తె బిస్తు ఘోష్ ఉంది.బుధవారం మధ్యాహ్నం ఆ చిన్నారి హాస్టల్‌లోని గ్రిల్ లిఫ్ట్‌లో గ్రౌండ్ ఫ్లోర్ నుండి 5వ ఫ్లోర్‌కు వెళ్తోంది.లిఫ్ట్ 3వ అంతస్తుకు చేరుకునే సరికి ప్రమాదవశాత్తు చిన్నారి జుట్టు, తల లిఫ్ట్ గ్రిల్స్ మధ్య ఇరుక్కుపోయాయి. దీంతో తల తీవ్రంగా నలిగిపోయి ఆ పసిపాప అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు.గచ్చిబౌలి పోలీసులు, హైడ్రా (HYDRAA), మరియు ఫైర్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు.లిఫ్ట్ లో చిక్కుకున్న చిన్నారి మృతదేహాన్ని బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి, హాస్టల్ యాజమాన్యం నిర్లక్ష్యంపై దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి