Breaking News

బోర్డు తిప్పేసిన CD దాశరథ్ కన్సల్టెన్సీ

హైదరాబాద్‌ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్‌పేట్‌లో "CD దాశరథ్ కన్సల్టెన్సీ" (CD Dasarath Consultancy) అనే సంస్థ బోర్డు తిప్పేసి, నిరుద్యోగులను భారీగా మోసం చేసింది.


Published on: 18 May 2026 18:02  IST

హైదరాబాద్‌ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్పేట్లో "CD దాశరథ్ కన్సల్టెన్సీ" (CD Dasarath Consultancy) అనే సంస్థ బోర్డు తిప్పేసి, నిరుద్యోగులను భారీగా మోసం చేసింది. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ సుమారు 90 మందికి పైగా నిరుద్యోగుల నుండి ఒక్కొక్కరి చొప్పున ₹6 లక్షల వరకు వసూలు చేసి కార్యాలయాన్ని మూసివేసి పరారయ్యారు.

అర్చన, సోమశేఖర్, రాజేంద్రప్రసాద్ అనే ముగ్గురు వ్యక్తులు ఈ ఘరానా మోసానికి పాల్పడ్డారు.నిరుద్యోగులను టార్గెట్ చేస్తూ విదేశాల్లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికారు. డబ్బులు తీసుకున్న తర్వాత ఆఫీస్ బోర్డు తీసేసి (కార్యాలయం మూసేసి) ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకుని పరారయ్యారు.డబ్బులు కోల్పోయిన బాధితులు ఆఫీస్ వద్దకు చేరుకుని తాము మోసపోయామని గ్రహించి, తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

Follow us on , &

ఇవీ చదవండి