Breaking News

టెన్త్ నుంచి బీటెక్ వరకు అర్హతతో 2000 ఉద్యోగాల అవకాశం..!

అనకాపల్లి జిల్లాలో మే 19న భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. టెన్త్‌, ఇంటర్‌, ఐటీఐ నుంచి బీటెక్ వరకు అర్హత ఉన్న యువతకు 2000కు పైగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.


Published on: 18 May 2026 19:21  IST

మే 19న భారీ జాబ్ మేళా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మే 19, 2026న అనకాపల్లి జిల్లాలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో జరుగనున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి, ఎమ్మెల్యే వంగలపూడి అనితా సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

వేదిక వివరాలు

ఈ జాబ్ మేళా నక్కపల్లి మెయిన్‌లోని జెడ్పీ గర్ల్స్ హైస్కూల్‌, ఎంపీపీ మోడల్ స్కూల్ ప్రాంగణంలో ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానుంది. స్పాట్ రిజిస్ట్రేషన్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

పాల్గొనే కంపెనీలు

హెటెరో ల్యాబ్స్‌, డెక్కన్ ఫైన్ కెమికల్స్‌, టాటా ఎలక్ట్రానిక్స్‌, అపిటోరియా, స్కిల్జా గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్‌, జైన్ ఎనామెల్ వర్క్స్‌, 2050 హోమ్ హెల్త్‌కేర్‌, అపోలో ఫార్మసీ, నవత రోడ్ ట్రాన్స్‌పోర్ట్‌, పేటీఎం సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌ వంటి పలు ప్రముఖ సంస్థలు ఈ జాబ్ మేళాలో పాల్గొననున్నాయి.

2000కు పైగా ఉద్యోగ అవకాశాలు

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు 15కు పైగా కంపెనీలతో చర్చించి ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మొత్తం 2000కు పైగా ఖాళీలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.

అర్హతలు ఏమిటి?

పదో తరగతి, ఇంటర్‌, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్‌, ఎలక్ట్రికల్ ఎనర్జీ సిస్టమ్స్‌, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన యువత ఈ జాబ్ మేళాకు హాజరుకావచ్చు. యువ అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తామని నిర్వాహకులు తెలిపారు.

ఉద్యోగ ప్రాంతాలు

ఎంపికైన అభ్యర్థులకు విజయవాడ, కృష్ణా, గుంటూరు, హైదరాబాద్‌, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.

ముందస్తు నమోదు తప్పనిసరి

ఆసక్తిగల యువత ముందుగా నైపుణ్యం అధికారిక వెబ్‌సైట్‌లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. మే 19న ఉదయం 10 గంటలకు అవసరమైన సర్టిఫికెట్లు, బయోడేటాతో హాజరుకావాలని తెలిపారు.

సంప్రదించాల్సిన నంబర్

జాబ్ మేళాకు సంబంధించిన వివరాల కోసం అభ్యర్థులు 8247505171 నంబర్‌ను సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి