Breaking News

ఎయిర్‌టెల్ తన పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల కోసం 5G నెట్‌వర్క్ స్లైసింగ్ సాంకేతికతతో కూడిన భారతదేశపు మొట్టమొదటి ‘ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్’ సేవలను అధికారికంగా ప్రారంభించింది.

ఎయిర్‌టెల్ తన పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల కోసం 5G నెట్‌వర్క్ స్లైసింగ్ (Network Slicing) సాంకేతికతతో కూడిన భారతదేశపు మొట్టమొదటి ‘ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్’ (Priority Postpaid) సేవలను అధికారికంగా ప్రారంభించింది.


Published on: 20 May 2026 12:24  IST

ఎయిర్‌టెల్ తన పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల కోసం 5G నెట్వర్క్ స్లైసింగ్ (Network Slicing) సాంకేతికతతో కూడిన భారతదేశపు మొట్టమొదటి ప్రయారిటీ పోస్ట్పెయిడ్’ (Priority Postpaid) సేవలను అధికారికంగా ప్రారంభించింది. ఈ సరికొత్త టెక్నాలజీ ద్వారా రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్ లేదా రద్దీగా ఉండే మార్కెట్లలో కూడా సిగ్నల్ డ్రాప్ అవ్వకుండా, అత్యంత వేగవంతమైన ఫాస్ట్లేన్ కనెక్టివిటీఇంటర్నెట్ అందుతుంది.

ఈ సేవలు ప్రస్తుతం ఉన్న అన్ని ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లపై అందుబాటులో ఉంటాయి. పాత వినియోగదారులకు ఎటువంటి అదనపు రుసుము లేకుండా ఈ సేవలు ఆటోమేటిక్‌గా అప్‌గ్రేడ్ అవుతాయి.

ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధరలు & ప్రయోజనాలు

అన్ని ప్లాన్లలోనూ అపరిమిత కాల్స్ (Unlimited Calling), ఉచిత రోమింగ్, రోజుకు 100 SMSలు (నెలకి 3000 SMS), ప్రయారిటీ 5G యాక్సెస్, స్పామ్/ఫ్రాడ్ అలర్ట్స్ కామన్ బెనిఫిట్స్‌గా లభిస్తాయి.

మొబైల్ అర్హత: మీ స్మార్ట్‌ఫోన్ 5G Standalone (5G SA) నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేయాలి మరియు ఫోన్ సాఫ్ట్‌వేర్ పూర్తిగా అప్‌డేట్ అయి ఉండాలి.

స్టేటస్ చెకింగ్: మీ ఫోన్ ఈ సేవకు సిద్ధంగా ఉందో లేదో తెలుసుకోవడానికి Airtel Thanks App లోని సెట్టింగ్స్ విభాగంలో ‘Phone Readiness’ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

కొత్త కస్టమర్లు: ప్రస్తుతం ప్రీపెయిడ్ వాడుతున్న వారు లేదా ఇతర నెట్‌వర్క్ వినియోగదారులు ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా లేదా నేరుగా దగ్గరలోని Airtel Store కి వెళ్లి ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్‌కి మారవచ్చు.

Follow us on , &

ఇవీ చదవండి