Breaking News

మైనర్‌ బాలికతో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ వివాహం

మైనర్‌ బాలికను రహస్యంగా వివాహం చేసుకున్న యాదగిరిగుట్ట ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ నాయిని అనిల్‌ కుమార్‌పై హుజూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.


Published on: 20 May 2026 12:59  IST

మైనర్‌ బాలికను రహస్యంగా వివాహం చేసుకున్న యాదగిరిగుట్ట ట్రాఫిక్కానిస్టేబుల్నాయిని అనిల్కుమార్పై హుజూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.యాదగిరిగుట్ట ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న నాయిని అనిల్‌ కుమార్‌ (హుజూర్‌నగర్‌ మండలంలోని సీతారాంపురం గ్రామానికి చెందినవాడు).అనిల్‌ కుమార్‌ మే 9వ తేదీన అనంతగిరి మండలం పాలేరు గ్రామానికి చెందిన ఒక మైనర్‌ బాలికను ఆమె తల్లిదండ్రుల అనుమతితో రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు.చట్టాన్ని రక్షించాల్సిన కానిస్టేబులే బాల్య వివాహం చేసుకున్నారనే సమాచారం అందుకున్న మహిళా శిశు సంక్షేమ శాఖ (ICDS) అధికారులు వెంటనే స్పందించారు. వారు హుజూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌పై రాతపూర్వక ఫిర్యాదు చేశారు.

హుజూర్‌నగర్‌ ఎస్‌ఐ నరేష్‌ తెలిపిన వివరాల ప్రకారం, ఐసీడీఎస్ అధికారుల ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్‌ అనిల్‌ కుమార్‌పై బాల్య వివాహ నియంత్రణ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Follow us on , &

ఇవీ చదవండి