Breaking News

భారత ప్రధాని నరేంద్ర మోదీపై నార్వేకు చెందిన 'ఆప్టెన్‌పోస్టన్‌' అనే దినపత్రిక జాత్యహంకార కార్టూన్‌ను ప్రచురించి తీవ్రస్థాయిలో అక్కసు వెళ్లగక్కింది

భారత ప్రధాని నరేంద్ర మోదీపై నార్వేకు చెందిన 'ఆప్టెన్‌పోస్టన్‌' (Aftenposten) అనే ప్రముఖ దినపత్రిక జాత్యహంకార కార్టూన్‌ను ప్రచురించి తీవ్రస్థాయిలో అక్కసు వెళ్లగక్కింది.


Published on: 20 May 2026 14:52  IST

భారత ప్రధాని నరేంద్ర మోదీపై నార్వేకు చెందిన 'ఆప్టెన్పోస్టన్‌' (Aftenposten) అనే ప్రముఖ దినపత్రిక జాత్యహంకార కార్టూన్‌ను ప్రచురించి తీవ్రస్థాయిలో అక్కసు వెళ్లగక్కింది. ప్రధాని మోదీ నార్వే పర్యటన ముగించుకుని ఇటలీ వెళ్లిన తరుణంలో, మే 20, 2026న ఈ వివాదాస్పద కార్టూన్ అంశం సోషల్ మీడియాలో అత్యంత వేగంగా వైరల్‌గా మారింది.

ఈ పత్రిక ప్రధాని మోదీని 'పాములు ఆడించే వ్యక్తి' గా చిత్రీకరించింది. ఇందులో ఆయన చేతిలో పెట్రోల్ బంక్ పైపు పాము ఆకారంలో ఉన్నట్లు చూపించారు.ఈ కార్టూన్‌తో పాటు ప్రచురించిన వ్యాసానికి 'ఒక తెలివైన, విసిగించే వ్యక్తి' అని అర్థం వచ్చేలా వివాదాస్పద శీర్షికను పెట్టారు.కేవలం వ్యక్తిగత విమర్శలకే పరిమితం కాకుండా, ఈ వ్యాసంలో భారతదేశ ప్రస్తుత విదేశాంగ విధానాన్ని కూడా తీవ్రంగా తప్పుబడుతూ ఆ పత్రిక విమర్శలు గుప్పించింది.ఈ కార్టూన్ బయటకు రాగానే సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, భారతీయ మద్దతుదారులు ఆ పత్రికపై తీవ్రంగా మండిపడుతున్నారు.

పాశ్చాత్య దేశాలు ఇంకా తమ పాత వలసవాద భ్రమల నుండి, మూస ధోరణుల (Stereotypes) నుండి బయటకు రాలేకపోతున్నాయని నెటిజన్లు విమర్శిస్తున్నారు.భారతదేశం ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, టెక్నాలజీ హబ్‌గా ఎదుగుతుంటే పాశ్చాత్య మీడియా తట్టుకోలేక ఇలాంటి చౌకబారు జాత్యహంకార జర్నలిజానికి పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ఈ కార్టూన్ వివాదానికి ముందే ఓస్లో పర్యటనలో ప్రధాని మోదీకి మీడియా పరంగా మరో అనుభవం ఎదురైంది.

ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్ ముగిసిన తర్వాత 'దగ్సావిసెన్' (Dagsavisen) పత్రికకు చెందిన మహిళా జర్నలిస్ట్ 'హెల్లే లీంగ్ స్వెండ్సెన్'.. "ప్రపంచంలోనే అత్యంత పత్రికా స్వేచ్ఛ ఉన్న నార్వే మీడియా నుండి మీరు ప్రశ్నలు ఎందుకు తీసుకోరు?" అని ప్రధానిని ప్రశ్నించారు.ప్రధాని మోదీ దీనికి సమాధానం ఇవ్వకుండా వెళ్లగా, ఆ తర్వాత జరిగిన ప్రెస్ బ్రిఫింగ్‌లో భారత విదేశాంగ శాఖ (MEA) కార్యదర్శి సిబి జార్జ్ స్పందిస్తూ.. భారతదేశం ఒక గొప్ప నాగరికత కలిగిన దేశమని, రాజ్యాంగం ద్వారా పౌరులందరికీ ప్రాథమిక హక్కులు పటిష్టంగా అందుతున్నాయని నార్వే మీడియాకు గట్టిగా బదులిచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి