Breaking News

గ్యాస్ సిలిండర్ పేలి ఒక మహిళకు గాయాలు

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులోని దుంపగడప రైల్వే గేట్ సమీపంలో గల జవహర్ పేటలో 20 మే 2026 (బుధవారం) మధ్యాహ్నం గ్యాస్ సిలిండర్ పేలి ఒక మహిళకు గాయాలయ్యాయి.

Published on: 20 May 2026 18:48  IST

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులోని దుంపగడప రైల్వే గేట్ సమీపంలో గల జవహర్ పేటలో 20 మే 2026 (బుధవారం) మధ్యాహ్నం గ్యాస్ సిలిండర్ పేలి ఒక మహిళకు గాయాలయ్యాయి.

ప్రమాదంలో బొమ్మి లక్ష్మీ అనే మహిళ గాయపడ్డారు.బుధవారం మధ్యాహ్నం సుమారు 12 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.బాధితురాలు ఇంట్లో పాలు కాస్తుండగా ఒక్కసారిగా వంట గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి.ఈ ప్రమాదంలో ఆమె ముఖం, చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి ఇంట్లోని సామాగ్రి మొత్తం కాలి బూడిదైంది. ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన కుటుంబసభ్యులు ఆమెను సురక్షితంగా రక్షించి, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి