Breaking News

శుక్రుడు-గురువు కలయికతో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!

శుక్రుడు, గురువు మిథున రాశిలో కలిసి సంచరిస్తుండటంతో కొన్ని రాశుల సతీమణులకు జూన్ 8 వరకు అదృష్ట యోగం ఏర్పడిందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. వృత్తి, ఉద్యోగం, ధనలాభాల్లో అనుకూల ఫలితాలు కనిపించే అవకాశం ఉందంటున్నారు.


Published on: 20 May 2026 19:12  IST

జ్యోతిష శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహం దాంపత్య జీవితం, సుఖ సంతోషాలు, విలాసాలు, భార్య అదృష్టానికి కారకుడిగా భావిస్తారు. ప్రస్తుతం శుక్రుడు మిథున రాశిలో గురువుతో కలిసి సంచరిస్తుండటంతో పాటు బుధుడితో పరివర్తన యోగం ఏర్పడింది. ఈ గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారి సతీమణులకు జూన్ 8 వరకు అనుకూల ఫలితాలు కనిపించే అవకాశముందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వృషభం, మిథునం, సింహం, కన్య, తుల, కుంభ రాశుల వారికి ఈ కాలం ప్రత్యేకంగా ఉండొచ్చని అంటున్నారు.

వృషభ రాశి

ఈ రాశివారి సతీమణులకు కుటుంబంలో గౌరవం, సమాజంలో గుర్తింపు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి కనిపించవచ్చు. ఆదాయం పెరగడం, విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి.

మిథున రాశి

దాంపత్య జీవితం సుఖంగా సాగేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొనవచ్చు. ఆర్థిక లాభాలు, గృహం లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం, ఆదాయం పరంగా కూడా అనుకూల ఫలితాలు కనిపించే సూచనలు ఉన్నాయి.

సింహ రాశి

ఈ రాశివారి సతీమణులకు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశముందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. పెట్టుబడులు, మదుపుల ద్వారా లాభాలు రావచ్చు. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో గుర్తింపు, ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉంది.

కన్య రాశి

వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు తగ్గే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలు లేదా విహార యాత్రలకు అనుకూల సమయం కావొచ్చు. వృత్తి జీవితంలో గుర్తింపు పెరగడం, ఉద్యోగంలో అవకాశాలు మెరుగుపడే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో సానుకూల వాతావరణం నెలకొనవచ్చు.

తుల రాశి

ఈ రాశివారి సతీమణులకు సంపద, ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధించే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలు మెరుగుపడటంతో పాటు పదోన్నతులు కూడా రావచ్చని జ్యోతిష నిపుణులు పేర్కొంటున్నారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగవచ్చు.

కుంభ రాశి

దాంపత్య జీవితంలో ఉన్న విభేదాలు తగ్గే అవకాశం ఉంది. ఉద్యోగ, వృత్తి రంగాల్లో ప్రతిభకు గుర్తింపు లభించవచ్చు. కొత్త పరిచయాలు ఏర్పడి, వాటి ద్వారా ప్రయోజనాలు కలిగే సూచనలు ఉన్నాయి. ఆకస్మిక ధనలాభం, సంతాన యోగం వంటి శుభఫలితాలు కూడా ఉండొచ్చని చెబుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి