Breaking News

హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు వేడుక

తెలుగుదేశం పార్టీ (TDP) మహానాడు మే 27, 2026 (బుధవారం) నుండి రెండు రోజుల పాటు అత్యంత వైభవంగా ప్రారంభమైంది. పొదుపు చర్యల్లో భాగంగా ఈ మహా వేడుకను హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నారు.


Published on: 27 May 2026 14:55  IST

తెలుగుదేశం పార్టీ (TDP) మహానాడు మే 27, 2026 (బుధవారం) నుండి రెండు రోజుల పాటు అత్యంత వైభవంగా ప్రారంభమైంది. పొదుపు చర్యల్లో భాగంగా ఈ మహా వేడుకను హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం నుండి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, పొలిట్ బ్యూరో సభ్యులు మరియు ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు.

వ్యయ ప్రయాసలు తగ్గించేందుకు ఈసారి హైబ్రిడ్ మోడల్ ఎంచుకున్నారు. దాదాపు 18 వందల 75 క్లస్టర్ల నుంచి లక్షలాది మంది కార్యకర్తలు, శ్రేణులు ఆన్‌లైన్ పద్ధతిలో ఈ వేడుకలో భాగస్వామ్యమయ్యారు.జెండా ఆవిష్కరణ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ పసుపు జెండాను ఆవిష్కరించి మహానాడును అధికారికంగా ప్రారంభించారు.

రాజకీయ తీర్మానాలు: రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాలు మరియు ప్రజా సమస్యలపై ఈ రెండు రోజుల్లో మొత్తం 20 కీలక రాజకీయ తీర్మానాలను ప్రవేశపెట్టి చర్చించనున్నారు.

మహిళలకు ప్రాధాన్యత: పార్టీలో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ, రాబోయే రోజుల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని మంత్రి నారా లోకేశ్ ఈ వేదికపై కీలక ప్రకటన చేశారు.

యువతకు అగ్రతాంబూలం: రేపటి తరాన్ని నడిపించే యువతకు, పార్టీకి వెన్నుదన్నుగా నిలిచే శ్రేణులకు ఈసారి మహానాడులో అత్యంత ప్రాధాన్యత కల్పించారు.

Follow us on , &

ఇవీ చదవండి