Breaking News

ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో బెత్వా నదిపై నిర్మాణంలో ఉన్న ఒక భారీ వంతెన కూలిపోవడంతో ఆరుగురు కార్మికులు మరణించారు

ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో బెత్వా నదిపై నిర్మాణంలో ఉన్న ఒక భారీ వంతెన కూలిపోవడంతో ఆరుగురు కార్మికులు మరణించారు.


Published on: 29 May 2026 14:52  IST

ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో బెత్వా నదిపై నిర్మాణంలో ఉన్న ఒక భారీ వంతెన కూలిపోవడంతో ఆరుగురు కార్మికులు మరణించారు.మే 28-29, 2026 రాత్రి సమయంలో వీచిన తీవ్రమైన ఈదురుగాలులు, భారీ ఆంధీ-తుఫాను (Storm) కారణంగా నిర్మాణంలో ఉన్న వంతెన స్లాబ్ ఒక్కసారిగా కూలిపోయింది.

ఉత్తరప్రదేశ్, హమీర్‌పూర్ జిల్లాలోని బెత్వా నది భారీ ఈదురుగాలులు మరియు ఆంధీ తుఫాను కారణంగా నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలింది.శిథిలాల కింద నలిగి అలాగే నదిలో మునిగి అక్కడికక్కడే ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.స్థానిక పోలీసులు మరియు ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని యుద్ధప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న మిగతా వారిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ. 5 లక్షల , గాయపడిన వారికి 50 వేల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. వంతెన నిర్మాణంలో నాణ్యతా లోపాలపై ఉన్నతాధికారుల దర్యాప్తునకు ఆదేశించారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement