Breaking News

భారతదేశంలో వీగన్ ఆహార పదార్థాలను గుర్తించడం ఇకపై చాలా సులభం, ఎందుకంటే FSSAI వీగన్ ఉత్పత్తుల కోసం ఒక ప్రత్యేకమైన అధికారిక లోగో ఖరారు చేసింది

భారతదేశంలో వీగన్ ఆహార పదార్థాలను గుర్తించడం ఇకపై చాలా సులభం కానుంది, ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) మే 2026 నాటి సవరించిన నిబంధనల ప్రకారం వీగన్ ఉత్పత్తుల కోసం ఒక ప్రత్యేకమైన అధికారిక లోగోను ఖరారు చేసింది.


Published on: 05 Jun 2026 15:19  IST

భారతదేశంలో వీగన్ ఆహార పదార్థాలను గుర్తించడం ఇకపై చాలా సులభం కానుంది, ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) మే 2026 నాటి సవరించిన నిబంధనల ప్రకారం వీగన్ ఉత్పత్తుల కోసం ఒక ప్రత్యేకమైన అధికారిక లోగోను ఖరారు చేసింది. ఈ నిబంధనలు జూలై 1, 2027 నుండి దేశవ్యాప్తంగా తప్పనిసరి కానున్నాయి.

కొత్త వీగన్ లోగో

ఇప్పటివరకు శాకాహారానికి ఇచ్చే సాధారణ ఆకుపచ్చ (Green) గుర్తు వల్ల ఏది సాధారణ శాఖాహారమో, ఏది వీగన్ పదార్థమో తెలుసుకోవడం కష్టంగా ఉండేది.

లోగో రూపం: కొత్త లోగోలో ఒక ఆకుపచ్చటి చతురస్రం (Square) లోపల 'V' ఆకారం ఉంటుంది.

చిన్న మొక్క గుర్తు: ఆ 'V' అక్షరంపై ఒక చిన్న మొలక లేదా ఆకు గుర్తు ఉంటుంది.

ఇది ప్యాకెట్ పై ఉంటే, అందులో ఎలాంటి జంతు సంబంధిత పదార్థాలు (పాలు, తేనె, నెయ్యి వంటివి కూడా) లేవని అర్థం.మార్కెట్లో దొరికే ఏ వస్తువునైనా వీగన్‌గా గుర్తించాలంటే అందులో కిందివి ఉండకూడదు:

జంతు మాంసం, గుడ్లు, చేపలు.

పాలు మరియు పాల పదార్థాలు: నెయ్యి, వెన్న, చీజ్, ప్యాకెట్ పాలు, మజ్జిగ.

కీటకాల ద్వారా వచ్చేవి: తేనె, సిల్క్ లేదా కొన్ని రకాల రంగులు.

యానిమల్ టెస్టింగ్: సదరు ఉత్పత్తిని తయారు చేసే క్రమంలో జంతువులపై ఎలాంటి ప్రయోగాలు చేసి ఉండకూడదు.

సులువుగా గుర్తించడానికి చిట్కాలు

కొత్త లోగో పూర్తి స్థాయిలో మార్కెట్లోకి వచ్చే లోపు మీరు వస్తువులను ఇలా చెక్ చేయవచ్చు:

పదార్థాల జాబితా : ప్యాకెట్ వెనుక భాగంలో పాలు, ల్యాక్టోజ్, కేసిన్, లేదా తేనె (Honey) ఉన్నాయేమో చూడండి. ఇవి ఉంటే అది వీగన్ కాదు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement