Breaking News

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో గురువారం ఉదయం మరొక ప్రమాదం కార్మికులలో తీవ్ర ఆందోళన

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జూన్ 11, 2026, గురువారం ఉదయం మరొక ప్రమాదం చోటుచేసుకుంది. ఇటివలే జరిగిన ఘోర ప్రమాదం మరువకముందే ఈ తాజా ఘటన జరగడంతో కార్మికులలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.


Published on: 11 Jun 2026 11:57  IST

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జూన్ 11, 2026, గురువారం ఉదయం మరొక ప్రమాదం చోటుచేసుకుంది. ఇటివలే జరిగిన ఘోర ప్రమాదం మరువకముందే ఈ తాజా ఘటన జరగడంతో కార్మికులలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

స్టీల్ మెల్టింగ్ షాప్-1 (SMS-1) విభాగంలోని ఆర్గన్ రిన్సింగ్ స్టేషన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.ఉదయం 5:30 గంటల సమయంలో ద్రవ ఉక్కును తరలిస్తున్న ఒక ల్యాడిల్ (Ladle) కు రంధ్రం పడటంతో వేడి ద్రవ ఉక్కు నేలపైకి లీకైంది.అదృష్టవశాత్తూ ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు మరియు పెద్ద ప్రమాదం తప్పింది.ఈ తాజా లీకేజీ ఘటనకు సరిగ్గా మూడు రోజుల క్రితం, జూన్ 8న జరిగిన పెద్ద పేలుడులో మరణించిన వారి సంఖ్య తొమ్మిదికి (9) చేరింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒప్పంద కార్మికుడు పైడిరాజు జూన్ 10 బుధవారం రోజున మరణించారు.

ప్లాంట్ లోని పాతబడిన యంత్రాలు, నిర్వహణ లోపాలు మరియు సిబ్బంది కొరత వల్లే ఇలాంటి ప్రమాదాలు పదే పదే జరుగుతున్నాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక నిపుణుల బృందం ప్రస్తుతం ఈ ప్రమాదాలపై విచారణ జరుపుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి