Breaking News

వాగులోకి దూసుకెళ్లిన కారు తప్పిన ప్రమాదం

ప్రకాశం జిల్లా టంగుటూరు - కొండపి మార్గంలో బుధవారం (17 జూన్ 2026) కారు అదుపుతప్పి వాగులోకి దూసుకెళ్లింది.టంగుటూరు - కొండపి మార్గంలోని జమ్ములపాలెం గ్రామ శివారులో ఉన్న అడ్డవాగు వద్ద ఈ ప్రమాదం జరిగింది.


Published on: 17 Jun 2026 17:28  IST

ప్రకాశం జిల్లా టంగుటూరులో బుధవారం (17 జూన్ 2026) కారు అదుపుతప్పి వాగులోకి దూసుకెళ్లింది.కొండపి మార్గంలోని జమ్ములపాలెం గ్రామశివారులో ఉన్న అడ్డవాగు వద్ద ఈ ప్రమాదం జరిగింది.కొండపి మండలం నేతివారిపాలెం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తన ఏడాది చిన్నారితో కలిసి కారులో ప్రయాణిస్తున్నారు.కారు నడుపుతున్న వ్యక్తి ఆ చిన్నారిని చేత్తో పట్టుకుని వాహనం డ్రైవ్ చేస్తుండటంతో, కారు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న అడ్డవాగులోకి దూసుకెళ్లింది.

అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో తండ్రి, కుమార్తె ఇద్దరూ ఎలాంటి గాయాలు లేకుండా క్షేమంగా బయటపడ్డారు.ప్రమాదం జరిగిన వెంటనే అటుగా వెళ్తున్న ఇతర వాహనదారులు, స్థానికులు స్పందించి కారులో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం వారి బంధువుల సాయంతో సురక్షితంగా ఇంటికి పంపించారు.

 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement