Breaking News

అమెరికాకు చైనా బిగ్ షాక్ ఇస్తూ, ఏకంగా 46 అమెరికన్ కంపెనీలపై నిషేధాజ్ఞలు విధించింది.

ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మళ్లీ తీవ్రరూపం దాల్చింది. 22 జూన్ 2026న అమెరికాకు చైనా బిగ్ షాక్ ఇస్తూ, ఏకంగా 46 అమెరికన్ కంపెనీలపై నిషేధాజ్ఞలు విధించింది.


Published on: 22 Jun 2026 14:15  IST

ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మళ్లీ తీవ్రరూపం దాల్చింది. 22 జూన్ 2026 అమెరికాకు చైనా బిగ్ షాక్ ఇస్తూ, ఏకంగా 46 అమెరికన్ కంపెనీలపై నిషేధాజ్ఞలు విధించింది. ఇటీవల చైనా సైన్యానికి సహకరిస్తున్నాయనే ఆరోపణలతో అలీబాబా , బైడూ వంటి ప్రముఖ 80 చైనీస్ టెక్ కంపెనీలను అమెరికా బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. దీనికి ప్రతీకారంగానే చైనా ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.

చైనా తీసుకున్న కీలక నిర్ణయాలు:

ప్రభుత్వ కొనుగోళ్లపై నిషేధం: చైనా ప్రభుత్వ ఏజెన్సీలు లేదా ప్రభుత్వ రంగ సంస్థలు ఈ 46 అమెరికన్ కంపెనీల నుండి ఎలాంటి ఉత్పత్తులను కొనుగోలు చేయకూడదని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

ప్రముఖ కంపెనీలపై వేటు: ఈ నిషేధిత జాబితాలో అమెరికా రక్షణ రంగానికి చెందిన ప్రముఖ కంపెనీలైన లాక్‌హీడ్ మార్టిన్ , రేథియాన్, బోయింగ్ (Boeing రక్షణ విభాగం), ఓష్‌కోష్ డిఫెన్స్ వంటి దిగ్గజాలు ఉన్నాయి.

ఎగుమతుల నియంత్రణ : అమెరికాకు చెందిన 10 మిలిటరీ సంబంధిత కంపెనీలకు సివిల్ మరియు మిలిటరీ అవసరాలకు ఉపయోగపడే ద్వంద్వ వినియోగ వస్తువులు, సాంకేతికతలు మరియు కీలక ఖనిజాల ఎగుమతులను చైనా నిలిపివేసింది. ఈ జాబితాలో అవియాక్స్ , రెడ్ క్యాట్ హోల్డింగ్స్ , టియల్ డ్రోన్స్ వంటి సంస్థలు ఉన్నాయి.

థర్డ్-పార్టీ దేశాలపై ఆంక్షలు: ఇతర దేశాలు చైనా నుంచి కొనుగోలు చేసిన వస్తువులను, ఆంక్షలకు గురైన ఈ అమెరికా కంపెనీలకు బదిలీ చేయడాన్ని కూడా చైనా పూర్తిగా నిషేధించింది.

గ్లోబల్ మార్కెట్లో "చైనా షాక్ 2.0 :

అంతర్జాతీయ నివేదికల ప్రకారం, అమెరికా విధించిన భారీ పన్నుల వల్ల చైనా తన వస్తువులను అమెరికాకు కాకుండా యూరప్ మరియు ఇతర ఆసియా దేశాల వైపు మళ్లిస్తోంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా చైనా ఎగుమతులు రికార్డు స్థాయిలో పెరిగి, గ్లోబల్ మార్కెట్‌ను శాసిస్తున్నాయి. దీనినే అంతర్జాతీయ నిపుణులు "చైనా షాక్ 2.0" గా అభివర్ణిస్తున్నారు. 2026 మే నెలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనలో కుదుర్చుకున్న ఒప్పందాలు జరిగిన నెలరోజులకే ఇరుదేశాల మధ్య మళ్లీ ఇలాంటి తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తడం గమనార్హం.

Follow us on , &

ఇవీ చదవండి