Breaking News

హైదరాబాద్‌లో అదృశ్యమై ఏలూరు లో ప్రత్యక్షమై

హైదరాబాద్‌లో అదృశ్యమైన ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో క్షేమంగా లభ్యమయ్యారు. ఫోన్ ఎక్కువగా చూస్తున్నారనే కారణంతో తల్లి మందలించడంతో, వారు ఇల్లు వదిలి వెళ్లిపోయారని పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు.హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.


Published on: 22 Jun 2026 14:33  IST

హైదరాబాద్‌లో అదృశ్యమైన ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో క్షేమంగా లభ్యమయ్యారు. ఫోన్ ఎక్కువగా చూస్తున్నారనే కారణంతో తల్లి మందలించడంతో, వారు ఇల్లు వదిలి వెళ్లిపోయారని పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు.హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.ముగ్గురు కుమార్తెలు మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడుతుండటంతో వారి తల్లి గట్టిగా మందలించింది.తల్లి కోపడటంతో మనస్తాపానికి గురైన ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి వెళ్ళిపోయారు. పిల్లలు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసుల దర్యాప్తు - ఆచూకీ లభ్యం

కేసు నమోదు చేసుకున్న ఫలక్‌నుమా పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.సాంకేతిక ఆధారాల సహాయంతో దర్యాప్తు చేయగా, ఆ ముగ్గురు బాలికలు ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.ప్రస్తుతం ఏలూరులో ఉన్న ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లను సురక్షితంగా రక్షించిన పోలీసులు, వారిని తిరిగి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి