Breaking News

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం (21 జూన్ 2026) రాత్రి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన ఘోర రోడ్డు ప్రమాదం.ములకలపల్లి మండలం పూసుగూడెం - మాదారం అటవీ ప్రాంత మార్గంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.


Published on: 22 Jun 2026 17:45  IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం (21 జూన్ 2026) రాత్రి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన ఘోర రోడ్డు ప్రమాదం.ములకలపల్లి మండలం పూసుగూడెం - మాదారం అటవీ ప్రాంత మార్గంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.భద్రాచలం వెంకటేశ్వర కాలనీకి చెందిన ఒకే కుటుంబం ములకలపల్లిలోని బంధువుల ఇంటి శుభకార్యానికి వెళ్లి కారులో తిరిగి వస్తుండగా, కారు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

ఈ ప్రమాదంలో దూదాల సాయి ప్రకాష్ (25), అతని భార్య సంధ్య (23), వారి 4 ఏళ్ల కుమారుడు మోక్షిత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.సాయి తల్లి జ్యోతికి తీవ్ర గాయాలు కావడంతో ఆమెను పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం.

Follow us on , &

ఇవీ చదవండి