Breaking News

అత్తింటి వేధింపులు తాళలేక యువతీ ఆత్మహత్య

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో అత్తింటి వేధింపులు, భర్త అనుమానం భరించలేక జ్యోత్స్న అనే ప్రైవేటు ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకుంది.


Published on: 24 Jun 2026 16:48  IST

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో అత్తింటి వేధింపులు, భర్త అనుమానం భరించలేక జ్యోత్స్న అనే ప్రైవేటు ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకుంది.
వివాహం జరిగిన నాటి నుండి అదనపు కట్నం కోసం వేధింపులు, అలాగే భర్త నాగరాజు నిరంతరం ఆమె ప్రవర్తనపై అనుమానం పెంచుకుని శారీరకంగా, మానసికంగా వేధించేవాడు.భర్త వేధింపులు రోజురోజుకూ మితిమీరడంతో తీవ్ర మనస్తాపానికి గురైన జ్యోత్స్న, జూన్ 21న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగింది.
కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే లక్సెట్టిపేట ఆసుపత్రికి, అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం మంచిర్యాలలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె జూన్ 23 రాత్రి కన్నుమూసింది.మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జన్నారం పోలీసులు భర్త నాగరాజు, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Follow us on , &

ఇవీ చదవండి