Breaking News

దక్షిణ అమెరికా దేశమైన వెనెజువెలాలో నిమిషాల వ్యవధిలో రెండు భారీ జంట భూకంపాలు సంభవించి తీవ్ర భీభత్సాన్ని సృష్టించాయి

దక్షిణ అమెరికా దేశమైన వెనెజువెలాలో 2026 జూన్ 25న  నిమిషాల వ్యవధిలో రెండు భారీ జంట భూకంపాలు సంభవించి తీవ్ర భీభత్సాన్ని సృష్టించాయి. ఈ విపత్తు కారణంగా దేశంలో తీవ్ర ఆస్తి, ప్రాణనష్టం సంభవించడంతో ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించింది. 


Published on: 25 Jun 2026 11:14  IST

దక్షిణ అమెరికా దేశమైన వెనెజువెలాలో 2026 జూన్ 25న  నిమిషాల వ్యవధిలో రెండు భారీ జంట భూకంపాలు సంభవించి తీవ్ర భీభత్సాన్ని సృష్టించాయి. ఈ విపత్తు కారణంగా దేశంలో తీవ్ర ఆస్తి, ప్రాణనష్టం సంభవించడంతో ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.1 నుండి 7.2 గా నమోదైంది. కరేబియన్ తీరంలోని మోరాన్ ప్రాంతానికి పశ్చిమంగా భూమికి 13 కిలోమీటర్ల లోతులో దీని కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.మొదటిది వచ్చిన కేవలం 39 సెకన్ల వ్యవధిలోనే మోరాన్‌కు నైరుతి దిశలో మరింత శక్తివంతమైన రెండో భూకంపం సంభవించింది.
రాజధాని కారకాస్ తో పాటు తీర ప్రాంత నగరమైన లా గుఐరా, పారిశ్రామిక నగరం చాకావోలలో బహుళ అంతస్తుల భవనాలు, నివాస గృహాలు కుప్పకూలిపోయాయి. అల్టామిరా పరిసరాల్లో భారీగా నష్టం వాటిల్లింది.ఈ ఘోర విపత్తు వల్ల సంభవించే మరణాల సంఖ్య 10,000 నుండి 1 లక్ష వరకు ఉండవచ్చని అమెరికా భూభౌతిక సర్వే సంస్థ ప్రాథమికంగా అంచనా వేసింది. వందలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు.కారకాస్ నగరంలోని పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్ వ్యవస్థలు పూర్తిగా నిలిచిపోయాయి.
భూకంపం సంభవించిన వెంటనే యూఎస్ సునామీ హెచ్చరికల కేంద్రం ప్యూర్టో రికో, వర్జిన్ ఐలాండ్స్, అరుబా, కురాకో ప్రాంతాలకు సునామీ హెచ్చరికలను జారీ చేసింది. అయితే సముద్ర మట్టాల్లో స్వల్ప మార్పుల తర్వాత, సుమారు గంట వ్యవధిలో ఈ హెచ్చరికలను ఉపసంహరించుకుంది. 
వెనెజువెలా అంతర్గత వ్యవహారాల మంత్రి డియోస్డాడో కాబెల్లో సహాయక చర్యల ప్రోటోకాల్స్‌ను యాక్టివేట్ చేసినట్లు ప్రకటించారు. ఇంకా ఆఫ్టర్ షాక్స్  వచ్చే ప్రమాదం ఉన్నందున ప్రజలు ఇళ్లలోకి వెళ్లకుండా ఆరుబయట, సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని కోరారు. రక్షణ సిబ్బంది శిథిలాలను తొలగించి బాధితులను రక్షించే పనిలో నిరంతరం శ్రమిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement