Breaking News

సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ సమీపంలో మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ సమీపంలో 2026 జూన్ 25 గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కాంప్లెక్స్ పక్కనే ఉన్న సూర్య కిరణ్ బిల్డింగ్ మొదటి అంతస్తులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.


Published on: 25 Jun 2026 19:48  IST

సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ సమీపంలో 2026 జూన్ 25 గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కాంప్లెక్స్ పక్కనే ఉన్న సూర్య కిరణ్ బిల్డింగ్ మొదటి అంతస్తులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ మంటలు చెలరేగినట్లు పోలీసులు, అధికారులు భావిస్తున్నారు.

సికింద్రాబాద్ పాట్నీ సమీపంలోని స్వప్నలోక్ కాంప్లెక్స్ / సూర్య కిరణ్ బిల్డింగ్ మొదటి అంతస్తు.25 జూన్ 2026, గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది (ఫైర్ ఇంజన్లు) ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు.

భవనం అంతా దట్టమైన పొగలు అలుముకోవడంతో, లోపల ఉన్న వారిని అధికారులు సురక్షితంగా బయటకు తరలించారు. ఈ ఘటన కారణంగా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

గతంలో కూడా ఇదే స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆ జ్ఞాపకాలు మరువక ముందే మళ్లీ అదే ప్రాంతంలో ప్రమాదం జరగడంతో స్థానిక వ్యాపారులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు మరియు ఆస్తి నష్టం అంచనా ఇంకా తెలియాల్సి ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement