Breaking News

వ్యాన్‌లో షార్ట్ సర్క్యూట్ డ్రైవర్ సురక్షితం

అనకాపల్లి జిల్లా కశింకోట జాతీయ రహదారిపై జరిగిన వ్యాన్‌ అగ్నిప్రమాదంలో డ్రైవర్ సురక్షితంగా తప్పించుకున్నారు.విజయవాడ నుంచి విజయనగరంలోని స్మార్ట్ బజార్‌కు సరుకులను అన్‌లోడ్ చేసి తిరుగు ప్రయాణమైన ఒక ఐషర్ వ్యాన్‌ క్యాబిన్‌లో షార్ట్ సర్క్యూట్ సంభవించింది.


Published on: 06 Jul 2026 19:07  IST

అనకాపల్లి జిల్లా కశింకోట జాతీయ రహదారిపై జరిగిన వ్యాన్‌ అగ్నిప్రమాదంలో డ్రైవర్ సురక్షితంగా తప్పించుకున్నారు.విజయవాడ నుంచి విజయనగరంలోని స్మార్ట్ బజార్‌కు సరుకులను అన్‌లోడ్ చేసి తిరుగు ప్రయాణమైన ఒక ఐషర్ వ్యాన్‌ క్యాబిన్‌లో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. కాలుతున్న వాసన రావడంతో డ్రైవర్ అప్రమత్తమై వెంటనే వాహనాన్ని రోడ్డు పక్కన ఆపేశారు.

డ్రైవర్ కిందకు దిగిన క్షణాల్లోనే వ్యాన్‌ క్యాబిన్ నుండి దట్టమైన పొగలు, మంటలు వేగంగా వ్యాపించాయి. స్థానికులు మరియు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసినప్పటికీ, వ్యాన్ చాలా వరకు కాలిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 6 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు.

 

Follow us on , &

ఇవీ చదవండి