Breaking News

అమెరికాలోని జార్జియాలో భారత సంతతికి చెందిన మాజీ గూగుల్ ఎగ్జిక్యూటివ్ శీతల్ విజియెన్ (57) తన భర్త చేతిలో దారుణంగా హత్యకు గురయ్యారు

అమెరికాలోని జార్జియాలో భారత సంతతికి చెందిన మాజీ గూగుల్ ఎగ్జిక్యూటివ్ శీతల్ విజియెన్ (57) తన భర్త చేతిలో దారుణంగా హత్యకు గురయ్యారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఘోర ఘటనా జరిగిందని స్థానిక పోలీసులు తెలిపారు.


Published on: 13 Jul 2026 12:19  IST

అమెరికాలోని జార్జియాలో భారత సంతతికి చెందిన మాజీ గూగుల్ ఎగ్జిక్యూటివ్ శీతల్ విజియెన్ (57) తన భర్త చేతిలో దారుణంగా హత్యకు గురయ్యారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఘోర ఘటనా జరిగిందని స్థానిక పోలీసులు తెలిపారు.

శీతల్ విజియెన్ (57), ఈమె గూగుల్‌లో సీనియర్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు మరియు రెండు సాఫ్ట్‌వేర్ పేటెంట్లను కూడా కలిగి ఉన్నారు.ఆమె భర్త కిర్క్ బి. వ్రజేసిన్ (56) .జార్జియా రాష్ట్రంలోని కాబ్ కౌంటీ లో గల వారి స్వగృహం.గొడవ సమయంలో తల్లిని రక్షించేందుకు ప్రయత్నించిన వారి కుమారుడు జేసన్‌పై కూడా నిందితుడు కాల్పులు జరపడంతో అతను తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోగా, ఆగ్రహానికి గురైన కిర్క్ బి. వ్రజేసిన్ తన వద్ద ఉన్న తుపాకీతో శీతల్‌పై పలుమార్లు కాల్పులు జరిపాడు. కాల్పుల శబ్దం విన్న అక్కడివారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకునే సరికే శీతల్ బుల్లెట్ గాయాలతో మృతి చెందింది. నిందితుడైన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని, హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద వార్త స్థానిక భారతీయ సమాజంలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

Follow us on , &

ఇవీ చదవండి

Advertisement