Breaking News

ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (CCI) దేశవ్యాప్తంగా వివిధ కార్యాలయాల్లో 148 ఉద్యోగాల భర్తీకి సరికొత్త నోటిఫికేషన్ విడుదల

ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (CCI) దేశవ్యాప్తంగా వివిధ కార్యాలయాల్లో 148 ఉద్యోగాల భర్తీకి సరికొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ పరిధిలోని ఈ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ 9 జూలై 2026న ప్రారంభమైంది, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 24 జూలై 2026.


Published on: 14 Jul 2026 18:42  IST

ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (CCI) దేశవ్యాప్తంగా వివిధ కార్యాలయాల్లో 148 ఉద్యోగాల భర్తీకి సరికొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ పరిధిలోని ఈ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ 9 జూలై 2026న ప్రారంభమైంది, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 24 జూలై 2026.

ఖాళీల వివరాలు

మొత్తం 148 పోస్టులను కింది విభాగాల వారీగా భర్తీ చేస్తున్నారు:

జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్: 50 పోస్టులు

జూనియర్ అసిస్టెంట్ (జనరల్): 30 పోస్టులు

జూనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్): 50 పోస్టులు

మేనేజ్‌మెంట్ ట్రైనీ (మార్కెటింగ్/అకౌంట్స్): 16 పోస్టులు (ఒక్కో విభాగంలో 8)

అసిస్టెంట్ మేనేజ్మెంట్ : 02 పోస్టులు

అర్హతలు & వయోపరిమితి

విద్యార్హత: పోస్టులను బట్టి ఏదైనా డిగ్రీ, బీకాం (B.Com), బీఎస్సీ అగ్రికల్చర్ (B.Sc Agriculture), ఎంబీఏ (MBA), లేదా బీఈ/బీటెక్ (B.E/B.Tech) పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.

వయస్సు: 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి (అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 32 ఏళ్లు).

ఎంపిక విధానం & జీతం

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష (CBT), సర్టిఫికేట్ వెరిఫికేషన్, మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్షలో ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.

వేతనం: ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ. 22,000 నుండి రూ. 1,40,000 వరకు ప్రారంభ వేతనం మరియు ఇతర అలవెన్సులు లభిస్తాయి.

దరఖాస్తు ఫీజు

జనరల్, OBC, EWS అభ్యర్థులకు: రూ. 1500 నుండి రూ. 1770 వరకు (జీఎస్టీతో కలిపి).

SC, ST, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు: రూ. 500 నుండి రూ. 590 వరకు.

అర్హత ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం మరియు ఆన్‌లైన్ అప్లికేషన్ కొరకు కాటన్ కార్పొరేషన్ అధికారిక వెబ్‌సైట్ www.cotcorp.org.in ను సందర్శించవచ్చు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement