Breaking News

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అమరావతి సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కేంద్రంలో వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం (14 జూలై 2026) రోజున అమరావతి సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కేంద్రంలో వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.


Published on: 14 Jul 2026 19:32  IST

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం (14 జూలై 2026) రోజున అమరావతి సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కేంద్రంలో వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పాలనలో వేగం పెంచడం, ప్రజా సమస్యల త్వరితగతిన పరిష్కారం మరియు పాత నిబంధనల సరళీకరణే ధ్యేయంగా ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

పనికిరాని బిజినెస్ రూల్స్ రద్దు - కమిటీ ఏర్పాటు

నిబంధనల సరళీకరణ: ఫైళ్ల క్లియరెన్స్ పేరుతో ప్రభుత్వ అభివృద్ధి పనులు మరియు పౌర సేవలు ఆలస్యం కాకూడదని సీఎం స్పష్టం చేశారు.

కమిటీ ఏర్పాటు: అవసరం లేని, కాలంచెల్లిన పాతకాలపు 'బిజినెస్ రూల్స్'ను పూర్తిగా సంస్కరించాలని ఆదేశించారు. వీటిని రీ-డ్రాఫ్ట్ (తిరిగి రాయడం) చేయడానికి తక్షణమే ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను నిర్దేశించారు.

క్రౌడ్ సోర్సింగ్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ

ప్రజాభిప్రాయ సేకరణ: క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను, ప్రభుత్వ సేవలపై వారి ఫీడ్‌బ్యాక్‌ను తెలుసుకోవడానికి క్రౌడ్ సోర్సింగ్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు.ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను టెక్నాలజీ సహాయంతో వేగంగా పర్యవేక్షించి, వాటిని వెనువెంటనే పరిష్కరించే ప్రోయాక్టివ్ గవర్నెన్ అందించడంపై దృష్టి పెట్టాలన్నారు.

దేవాలయాలను 'గ్రోత్ సెంటర్లుగా' అభివృద్ధి చేయడం

రాష్ట్రంలోని ప్రముఖ 21 దేవాలయాలను గ్రోత్ సెంటర్లుగా అభివృద్ధి చేయాలని సూచించారు.భక్తులకు కల్పించే సౌకర్యాలు, రవాణా మెరుగుదల మరియు ఆలయాల పరిసర ప్రాంతాల ఆర్థిక వృద్ధిపై ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

భూ వివాదాల పరిష్కారం

22A భూ సమస్యలు: రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా ఉన్న 22A భూ వివాదాలను వేగంగా పరిష్కరించాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. దీనిద్వారా భూములకు స్పష్టమైన హక్కులు కల్పించడంతో పాటు, కొత్త ఆర్థిక అవకాశాలను సృష్టించవచ్చని దిశానిర్దేశం చేశారు.

కీలక శాఖల సేవలపై సమీక్ష

ఈ సమీక్షలో దేవాదాయ శాఖ, రహదారులు-భవనాలు , ఏపీఎస్ఆర్టీసీ, రవాణా మరియు అగ్నిమాపక శాఖలు అందిస్తున్న పౌర సేవల ప్రగతిని అంచనా వేశారు.వ్యవసాయ రంగానికి సంబంధించి రాష్ట్రంలో యూరియా లభ్యత మరియు పంపిణీ ప్రస్తుత పరిస్థితిపై కూడా ప్రత్యేకంగా చర్చించారు.

 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement