Breaking News

బంజారాహిల్స్‌లో భారీ బంగారం దోపిడీ

హైదరాబాద్‌లోని ప్రముఖ వీఐపీ ప్రాంతమైన బంజారాహిల్స్‌లో 20 జూలై 2026 న ఒక భారీ దోపిడీ వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10, ఈడెన్ గార్డెన్ లోని గురుకృప ఎక్స్‌పోర్ట్స్ అనే జ్యువెలరీ ఎక్స్‌పోర్ట్ కార్యాలయంలో దుండగులు చొరబడి 1,028.59 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించారు.


Published on: 20 Jul 2026 16:14  IST

హైదరాబాద్‌లోని ప్రముఖ వీఐపీ ప్రాంతమైన బంజారాహిల్స్‌లో 20 జూలై 2026 న ఒక భారీ దోపిడీ వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10, ఈడెన్ గార్డెన్ లోని గురుకృప ఎక్స్పోర్ట్స్ అనే జ్యువెలరీ ఎక్స్‌పోర్ట్ కార్యాలయంలో దుండగులు చొరబడి 1,028.59 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించారు.

ఈ దొంగతనం శనివారం (జూలై 17) రాత్రి జరిగింది. ఆదివారం ఆఫీసుకు సెలవు కావడంతో, సోమవారం (జూలై 20) ఉదయం సిబ్బంది ఆఫీస్ తెరిచేసరికి ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దుండగులు అత్యంత పక్కా ప్రణాళికతో బిల్డింగ్ వెనుక వైపు ఉన్న వాష్‌రూమ్ (బాత్‌రూమ్) కిటికీ గ్రిల్స్‌ను పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. ఆ తర్వాత ఆఫీసులోని లాకర్‌ను పగలగొట్టి అందులో ఉన్న బంగారాన్ని లూటీ చేశారు.

వజ్రాలను పొదగడానికి తెచ్చిన ఆభరణాలను ఆఫీస్ లాకర్‌లో భద్రపరిచారు. దొంగలు ఎత్తుకెళ్లిన వాటిలో:

7 బంగారు హారాలు

7 జతల చెవి పోగులు

వీటి మొత్తం బరువు 1,028.59 గ్రాములు కాగా, వీటి విలువ సుమారు రూ. 25 లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

పోలీసుల దర్యాప్తు

గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వ్యాపారవేత్త ప్రీతేశ్ రమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.ఆఫీస్ లోపలి రూట్‌ మ్యాప్, భద్రతా లోపాలు తెలిసిన వారే ఈ పనికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.నిందితులను పట్టుకోవడానికి క్లూస్ టీమ్ రంగంలోకి దిగింది. 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement