Breaking News

ఉపాధ్యాయులకు మూడు రోజుల శిక్షణ

తాండూరు మండలంలోని ఉపాధ్యాయులకు మూడు రోజులపాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమం జూలై 20, 2026న (సోమవారం) ప్రారంభమైంది.తాండూరు మండల విద్యాధికారిణి ఇందుప్రియ గారు ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఎఫ్ఎల్ఎన్ పై ఉపాధ్యాయులకు పూర్తి అవగాహన కల్పించడం.


Published on: 20 Jul 2026 16:58  IST

తాండూరు మండలంలోని ఉపాధ్యాయులకు మూడు రోజులపాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమం జూలై 20, 2026న (సోమవారం) ప్రారంభమైంది.తాండూరు మండల విద్యాధికారిణి ఇందుప్రియ గారు ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఎఫ్ఎల్ఎన్ పై ఉపాధ్యాయులకు పూర్తి అవగాహన కల్పించడం. దీని ద్వారా విద్యార్థుల్లో ప్రాథమిక చదవడం, రాయడం మరియు గణిత సామర్థ్యాలను మరింతగా పెంపొందించడంపై శిక్షణ ఇస్తారు.మొదటిరోజు శిక్షణకు తాండూరు గ్రామీణ పరిధిలోని వివిధ పాఠశాలలకు చెందిన 67 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు.

జిల్లా విద్యాధికారి కార్యాలయం ఏఎమ్ఓ (AMO) రామ్ మస్తా పర్యవేక్షించగా, రిసోర్స్ పర్సన్స్ (RPs) గా లీలావతి, పరమేశ్వరి, రాంచందర్, ఉమాదేవి ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు శివకుమార్ కూడా పాల్గొన్నారు. ఈ మూడు రోజుల శిక్షణ ద్వారా ఉపాధ్యాయులు తరగతి గదుల్లో విద్యార్థుల అభ్యసన నైపుణ్యాలను మెరుగుపరచడానికి సరికొత్త బోధనా పద్ధతులను నేర్చుకుంటారు.

Follow us on , &

ఇవీ చదవండి