Breaking News

అతడికి ఏదో అయ్యింది..పిచ్చివాడిగా మారాడు..


Published on: 26 May 2025 11:49  IST

కాల్పుల విరమణ కోసం ఒకవైపు మంతనాలు జరుగుతున్న వేళ ఉక్రెయిన్‌పై రష్యా అతిపెద్ద వైమానిక దాడి చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందిస్తూ.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పై విరుచుకుపడ్డారు. ఆయన పూర్తిగా పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఉక్రెయిన్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకునే ఏ ప్రయత్నమైనా.. రష్యా పతనానికి దారితీస్తుందని గట్టిగా హెచ్చరించారు. ఈ మేరకు తన ట్రూత్‌ సోషల్‌లో ఓ పోస్ట్‌ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి