Breaking News

సూటుబూటుతో వచ్చి బురిడీ

ఆదిలాబాద్‌ పట్టణంలో ఒక వ్యక్తి సూటుబూటు వేసుకుని వచ్చి ఒక హార్డ్‌వేర్ దుకాణదారుడిని నమ్మించి, అతని ద్విచక్రవాహనాన్ని (స్కూటీ) సినీ ఫక్కీలో ఎత్తుకెళ్లి బురిడీ కొట్టించాడు.అ


Published on: 23 Jul 2026 19:31  IST

ఆదిలాబాద్‌ పట్టణంలో ఒక వ్యక్తి సూటుబూటు వేసుకుని వచ్చి ఒక హార్డ్‌వేర్ దుకాణదారుడిని నమ్మించి, అతని ద్విచక్రవాహనాన్ని (స్కూటీ) సినీ ఫక్కీలో ఎత్తుకెళ్లి బురిడీ కొట్టించాడు.అదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్‌లో ఉన్న 'శివం ఫ్లైవుడ్ అండ్ హార్డ్‌వేర్' దుకాణం.

ఒక గుర్తుతెలియని వ్యక్తి ఆటోలో సూటుబూటు ధరించి, చేతిలో ఒక ఖరీదైన బ్యాగుతో చాలా దర్జాగా ఆ దుకాణానికి వచ్చాడు.తన ఇంట్లో ఫ్లైవుడ్ పనులు జరుగుతున్నాయని చెప్తూ, రూ. 50 వేల విలువైన సామాన్లను యజమాని ప్రవీణ్‌సింగ్‌కు అందించాడు.

సరుకులకు జీఎస్టీ నంబరుతో కూడిన బిల్లు కావాలని, తన జీఎస్టీ నంబరు ప్రస్తుతం తన స్నేహితుడి వద్ద ఉందని నమ్మబలికాడు.ఆ నంబరు తీసుకురావడానికి దుకాణ యజమాని స్కూటీని అడిగాడు. అతని మాటలు నమ్మిన యజమాని తన వాహనాన్ని ఇచ్చాడు. అంతేకాకుండా, సదరు వ్యక్తి ఆటో డ్రైవర్ ఫోన్‌ను కూడా తీసుకుని స్కూటీపై వెళ్ళిపోయి, సాయంత్రం వరకు తిరిగి రాలేదు.

పోలీసుల దర్యాప్తు

బాధిత యజమాని ఫిర్యాదు చేయడంతో ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి నేతృత్వంలో దర్యాప్తు చేపట్టగా, ఆ వ్యక్తి ఇచ్చోడ నుంచి రూ. 800 కి ఆటో మాట్లాడుకుని కేవలం ద్విచక్రవాహనాన్ని దొంగిలించే పక్కా ప్రణాళికతోనే సూటుబూటు వేసుకుని వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు

 

Follow us on , &

ఇవీ చదవండి