Breaking News

యాపిల్ పండ్ల డీసీఎం బోల్తా..ఎగబడిన జనం

మహబూబాబాద్ జిల్లాలో ఆపిల్ పండ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ప్రజలు, అటుగా వెళ్తున్న వాహనదారులు మానవత్వాన్ని మర్చిపోయి ఆపిల్ పండ్లను దక్కించుకోవడానికి పెద్ద ఎత్తున ఎగబడ్డారు.

Published on: 30 Jul 2026 18:20  IST

మహబూబాబాద్ జిల్లాలో ఆపిల్ పండ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ప్రజలు, అటుగా వెళ్తున్న వాహనదారులు మానవత్వాన్ని మర్చిపోయి ఆపిల్ పండ్లను దక్కించుకోవడానికి పెద్ద ఎత్తున ఎగబడ్డారు.

వరంగల్ - ఖమ్మం జాతీయ రహదారిపై మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.ఆపిల్ పండ్ల లోడుతో వేగంగా వెళ్తున్న ఒక డీసీఎం వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది.

వ్యాన్ బోల్తా పడటంతో ఆపిల్ పండ్ల బాక్సులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ప్రమాదంలో గాయపడిన డ్రైవర్, క్లీనర్‌ను రక్షించాల్సింది పోయి, చుట్టుపక్కల జనాలు అందినకాడికి సంచులు, బస్తాలు, కవర్లలో ఆపిల్ పండ్లను నింపుకుని ఎత్తుకెళ్లారు.కేవలం కొన్ని నిమిషాల్లోనే డీసీఎంలోని లోడు మొత్తాన్ని జనాలు ఖాళీ చేసేశారు. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి