Breaking News

హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో 120 మేనేజ్‌మెంట్ ట్రైనీ మరియు డిజైన్ ట్రైనీ పోస్టుల భర్తీకి ప్రకటన

హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో 120 మేనేజ్‌మెంట్ ట్రైనీ మరియు డిజైన్ ట్రైనీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఈ పోస్టులకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 14 ఆగస్టు 2026 గా నిర్ణయించారు.


Published on: 06 Aug 2026 20:03  IST

హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో 120 మేనేజ్మెంట్ ట్రైనీ మరియు డిజైన్ ట్రైనీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఈ పోస్టులకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 14 ఆగస్టు 2026 గా నిర్ణయించారు.

ముఖ్యమైన వివరాలు

మొత్తం ఖాళీలు: 120 పోస్టులు (డిజైన్ ట్రైనీ - 60, మేనేజ్‌మెంట్ ట్రైనీ - 60).

అర్హత: సంబంధిత బ్రాంచ్‌లలో పూర్తి కాలపు B.E. / B.Tech / B.Sc (ఇంజనీరింగ్) ఉత్తీర్ణత. జనరల్/OBC/EWS అభ్యర్థులకు కనీసం 70%, SC/ST/PwBD అభ్యర్థులకు 60% మార్కులు ఉండాలి.

అర్హత గల బ్రాంచ్‌లు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, సివిల్, ఏరోనాటికల్, ప్రొడక్షన్, మెటలర్జీ, ఇన్‌స్ట్రుమెంటేషన్.

వయోపరిమితి : జనరల్/EWS అభ్యర్థులకు గరిష్టంగా 28 సంవత్సరాలు. నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది .

జీతం : ఏడాది ట్రెయినింగ్ కాలంలో నెలకు ₹50,000 స్టైపెండ్ ఇస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత గ్రేడ్-II ఇంజనీర్‌గా నెలకు ₹60,000 నుండి ₹1,60,000 వరకు వేతనం లభిస్తుంది.

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 29 జూలై 2026

దరఖాస్తుకు చివరి తేదీ: 14 ఆగస్టు 2026 

అడ్మిట్ కార్డ్ విడుదల : 20 ఆగస్టు 2026

పరీక్ష 5 మరియు 6 సెప్టెంబర్ 2026

ఎంపిక విధానం మరియు దరఖాస్తు రుసుము

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ రాత పరీక్ష మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: జనరల్, OBC, EWS అభ్యర్థులకు ₹500. SC/ST/PwBD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

Follow us on , &

ఇవీ చదవండి