Breaking News

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ 'అడోబీ ప్రీమియర్' మొబైల్ యాప్ ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఉచితంగా అందుబాటులోకి వచ్చింది.

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అడోబీ సంస్థ అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ 'అడోబీ ప్రీమియర్' మొబైల్ యాప్ ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఉచితంగా అందుబాటులోకి వచ్చింది.


Published on: 23 Sep 2026 18:58  IST

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అడోబీ సంస్థ అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ 'అడోబీ ప్రీమియర్' మొబైల్ యాప్ ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఉచితంగా అందుబాటులోకి వచ్చింది.సెప్టెంబర్ 2025లో ఐఫోన్ యూజర్ల కోసం విడుదలైన ఈ యాప్, ప్రస్తుతం భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ క్రియేటర్లందరికీ అందుబాటులోకి వచ్చింది.

అడోబీ ప్రీమియర్ మొబైల్ యాప్ ఫీచర్లు:

పూర్తిగా ఉచితం : ఈ యాప్‌ను ఉపయోగించడానికి ఎలాంటి క్రియేటివ్ క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ అవసరం లేదు. అంతేకాకుండా, వీడియోలపై ఎలాంటి వాటర్‌మార్క్‌లు పడవు, ఎలాంటి యాడ్స్ కూడా రావు.

4K వీడియో ఎక్స్‌పోర్ట్: యూజర్లు తాము ఎడిట్ చేసిన వీడియోలను ఉచితంగానే హై-క్వాలిటీ 4K రిజల్యూషన్‌లో సేవ్ చేసుకోవచ్చు.

మల్టీ-ట్రాక్ టైమ్‌లైన్ : డెస్క్‌టాప్ వెర్షన్ తరహాలోనే మొబైల్‌లో కూడా ఒకేసారి బహుళ వీడియో క్లిప్‌లు, ఆడియోలు, ఎఫెక్ట్‌లు మరియు టెక్స్ట్‌లను లేయర్‌లుగా అమర్చి ప్రొఫెషనల్ ఎడిటింగ్ చేసుకోవచ్చు.

AI ఆడియో ఎన్‌హాన్స్ : మన వాయిస్ ఓవర్లలోని బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ (వెనుక వచ్చే అనవసర శబ్దాలు) తొలగించి, స్టూడియో క్వాలిటీ ఆడియోను పొందేలా అడోబీ ఏఐ ఫీచర్ సహాయపడుతుంది.

ఫైర్‌ఫ్లై AI టూల్స్ : అడోబీ ఫైర్‌ఫ్లై ఆధారిత జెనరేటివ్ ఏఐ టూల్స్ వంటివి కూడా ఇందులో లభిస్తాయి.

గమనించాల్సిన విషయాలు :

కనీస అవసరాలు : ఈ యాప్ మీ మొబైల్‌లో సరిగ్గా పనిచేయాలంటే మీ ఫోన్‌లో కనీసం 5GB RAM మరియు ఆండ్రాయిడ్ 13 అంతకంటే ఎక్కువ వెర్షన్ ఓఎస్ ఉండాలి.

లిమిటెడ్ AI క్రెడిట్స్: బేసిక్ వీడియో ఎడిటింగ్ అంతా ఉచితమే అయినప్పటికీ, జెనరేటివ్ ఏఐ (AI) ఫీచర్లు ఎక్కువగా వాడాలన్నా, క్లౌడ్ స్టోరేజ్ అదనంగా కావాలన్నా మాత్రం ప్రీమియం ప్లాన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

Follow us on , &

ఇవీ చదవండి