Breaking News

పులివెందులలో రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు


Published on: 28 May 2025 17:16  IST

టీడీపీ మహానాడు అంగరంగ వైభవంగా జరుగుతున్న వేళ వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. దీంతో పులివెందుల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మహానాడు సందర్భంగా పులివెందులలో టీడీపీ శ్రేణులు పార్టీ జెండాలు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వైసీపీ శ్రేణులు తమ అక్కసును బయటపెట్టారు. పులివెందులలో తెలుగు తమ్ముళ్లు ఏర్పాటు చేసిన తెలుగుదేశం మహానాడు జెండాలను, బ్యానర్లను వైసీపీ శ్రేణులు పీకేశారు.

Follow us on , &

ఇవీ చదవండి