Breaking News

మొబైల్ వినియోగదారులను వేధిస్తున్న స్పామ్ కాల్స్ , టెలిమార్కెటింగ్ కాల్స్‌కు అడ్డుకట్ట వేసేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అత్యంత కఠినమైన కొత్త నిబంధనలను జారీ

మొబైల్ వినియోగదారులను వేధిస్తున్న స్పామ్ కాల్స్ , టెలిమార్కెటింగ్ కాల్స్‌కు అడ్డుకట్ట వేసేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అత్యంత కఠినమైన కొత్త నిబంధనలను జారీ చేసింది.


Published on: 29 Sep 2026 20:21  IST

మొబైల్ వినియోగదారులను వేధిస్తున్న స్పామ్ కాల్స్ , టెలిమార్కెటింగ్ కాల్స్‌కు అడ్డుకట్ట వేసేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అత్యంత కఠినమైన కొత్త నిబంధనలను జారీ చేసింది.

స్పామర్లపై తీసుకునే చర్యలు

ఫిర్యాదు లేకపోయినా యాక్షన్: వినియోగదారులు ప్రత్యేకంగా ఫిర్యాదు చేయకపోయినా, టెలికాం కంపెనీల AI , మెషిన్ లెర్నింగ్ వ్యవస్థలు అనుమానాస్పద స్పామ్ నంబర్లను గుర్తిస్తాయి.

మొదటి తప్పుకు 15 రోజులు బ్లాక్: AI వ్యవస్థ ద్వారా మొదటిసారి నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తిస్తే, సదరు నంబర్‌కు సంబంధించిన అన్ని రకాల అవుట్‌గోయింగ్ సేవలను 15 రోజుల పాటు నిలిపివేస్తారు.

రెండోసారి ఉల్లంఘిస్తే ఏడాది పాటు బ్యాన్: ఒకే వ్యక్తి లేదా సంస్థకు చెందిన నంబర్ల నుండి పదేపదే స్పామ్ కాల్స్ వస్తే, ఆ వ్యక్తి పేరిట ఉన్న అన్ని సిమ్ కార్డ్‌లు, టెలికాం వనరులను ఒక సంవత్సరం పాటు పూర్తిగా డిస్‌కనెక్ట్ చేసి, బ్లాక్‌లిస్ట్‌లో పెడతారు. ఆ ఏడాది కాలంలో వారికి ఎలాంటి కొత్త సిమ్ ఇవ్వరు.

కేవైసీ (KYC) రీ-వెరిఫికేషన్: ఒకే వ్యక్తికి చెందిన 5 లేదా అంతకంటే ఎక్కువ నంబర్లు 10 రోజుల వ్యవధిలో స్పామ్‌గా గుర్తించబడితే, సదరు టెలికాం ఆపరేటర్లు ఆ వ్యక్తి యొక్క కేవైసీని (KYC) మళ్లీ వెరిఫై చేయాల్సి ఉంటుంది.

టెలిమార్కెటింగ్ నంబర్ల సిరీస్ ,యాప్స్ పై ఆంక్షలు

ప్రత్యేక నంబర్ సిరీస్: ప్రమోషనల్ కాల్స్ అన్నీ 140 సిరీస్తో, మరియు ప్రభుత్వ లేదా ముఖ్యమైన సేవా కాల్స్ 160 సిరీస్తో ప్రారంభం కావాలి.

ట్రూకాలర్ లాంటి యాప్స్‌పై ఆంక్షలు: అధికారికంగా కేటాయించిన 140, 160 సిరీస్ నంబర్లను Truecaller లేదా ఇతర కాల్ మేనేజ్‌మెంట్ యాప్స్ స్పామ్‌గా ట్యాగ్ చేయడం లేదా బ్లాక్ చేయడం చేయకూడదు. అయితే, వినియోగదారులు తమ వ్యక్తిగత ఫోన్లలో వీటిని బ్లాక్ చేసుకునే స్వేచ్ఛ ఉంటుంది.

ఆటోమేటెడ్ కాల్స్‌కు జరిమానాలు: ముందస్తు అనుమతి లేకుండా చేసే ఆటోమేటెడ్ రోబోకాల్స్ పై నిమిషానికి ₹0.05 చొప్పున పెనాల్టీ విధిస్తారు.

ఈ కొత్త నిబంధనల ద్వారా జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా (Vi) వంటి టెలికాం ఆపరేటర్లు స్పామ్ కాల్స్ చేసే నెట్‌వర్క్‌లను మరింత వేగంగా గుర్తించి చర్యలు తీసుకోనున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి