Breaking News

ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొనడంతో దాదాపు 100 నుండి 300 వరకు గొర్రెలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో మంగళవారం (29 సెప్టెంబర్ 2026) తెల్లవారుజామున ఒక ఘోర ప్రమాదం జరిగింది. కాజీపేట నుండి హైదరాబాద్ నాంపల్లి వైపు వెళ్తున్న దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొనడంతో దాదాపు 100 నుండి 300 వరకు గొర్రెలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి.

Published on: 29 Sep 2026 20:57  IST

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో మంగళవారం (29 సెప్టెంబర్ 2026) తెల్లవారుజామున ఒక ఘోర ప్రమాదం జరిగింది. కాజీపేట నుండి హైదరాబాద్ నాంపల్లి వైపు వెళ్తున్న దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొనడంతో దాదాపు 100 నుండి 300 వరకు గొర్రెలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి.

ప్రమదం జరిగిన తీరు:

ప్రదేశం: ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔషాపూర్ సమీపంలో గల కేపాల్ వద్ద ఈ ప్రమాదం సంభవించింది.

కారణం: యాదాద్రి భువనగిరి జిల్లా జూలూరు అలీనగర్‌కు చెందిన కాపరులు తమ గొర్రెల మందను అక్కడ మేపుతున్నారు. తెల్లవారుజామున కాపరులు నిద్రిస్తున్న సమయంలో, అటుగా వచ్చిన దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలు హారన్ శబ్దానికి గొర్రెలు ఒక్కసారిగా భయపడి రైల్వే పట్టాలపైకి పరుగులు తీశాయి.

నష్టం: వేగంగా దూసుకొచ్చిన రైలు పట్టాలపై ఉన్న గొర్రెల మందపైకి వెళ్లడంతో కొన్ని నిమిషాల వ్యవధిలోనే వందలాది గొర్రెలు ప్రాణాలు కోల్పోయాయి.

పరామర్శ:

ఈ ఘోర ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన గొర్రెల కాపరులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య బాధితులను కలిసి వారిని పరామర్శించారు. నష్టపోయిన యాదవ కుటుంబాలకు ప్రభుత్వం తరఫున తగిన న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి