Breaking News

గోశామహల్‌లో హైదరాబాద్ సీపీ


Published on: 03 Jun 2025 13:30  IST

గోశామహల్ పోలీస్ గ్రౌండ్‌ను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఈరోజు (మంగళవారం) సందర్శించారు. గోశామహల్ పోలీస్ గ్రౌండ్‌లో నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మిస్తున్న సందర్భంగా హార్స్ గ్రౌండ్‌ను అక్కడి నుంచి చక్నావాడి దగ్గరలో షెడ్డును నిర్మించారు. ఈ క్రమంలో నూతనంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక హార్స్ గ్రౌండ్ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం మహిళా పోలీసులకు సెల్ఫ్ డిఫెన్స్‌పై ట్రైనింగ్‌ను పరిశీలించారు సీపీ.

Follow us on , &

ఇవీ చదవండి