Breaking News

పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తాం:పవన్


Published on: 05 Jun 2025 14:36  IST

కోటి మొక్కలు నాటి.. వాటిని సంరక్షించడమే తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అడవిలో కార్చిచుల నివారణకు, పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తానని అన్నారు. మానవ జీవితంలో ప్రకృతికి ఎంతో ప్రాధాన్యం ఉందని తెలిపారు. ఒకప్పుడు ఇంటి చిరునామాకు మొక్కలు, చెట్లు ఆనవాళ్లుగా ఉన్నాయని వెల్లడించారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు కానీ, ప్రకృతిని ప్రేమించే వ్యక్తి మనకు సీఎంగా ఉన్నారని ఉద్ఘాటించారు పవన్ కల్యాణ్.

Follow us on , &

ఇవీ చదవండి