Breaking News

నేను భయపడాలా..?’కేసుపై అంబటి రాంబాబు స్పందన


Published on: 05 Jun 2025 15:19  IST

నిన్న(బుధవారం) వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినం నిరసనల్లో భాగంగా తనను అడ్డుకున్న పోలీసులతో అంబటి రాంబాబు వాగ్వాదానికి దిగారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని పట్టాభిపురం పీఎస్‌లో అంబటిపై కేసు నమోదు చేశారు గుంటూరు పోలీసులు. ‘కాపుల మీదే కేసులు తిరగతోడాలనుకునే వారు.. నా మీద కేసులు పెట్టకుండా ఉంటారా.? కేసులకు నేను భయపడాలా.?’ అంటూ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్‌లో అంబటి రాంబాబు పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి