Breaking News

1,000 డాలర్లు చెల్లిస్తే తొందరగా వీసా ఇంటర్వ్యూ


Published on: 05 Jun 2025 16:10  IST

అమెరికా (USA) వీసా ఇంటర్వ్యూల కోసం ఏళ్లతరబడి ఎదురుచూడకుండా.. ఓ ప్రత్యేక విధానం ప్రవేశపెట్టాలని ట్రంప్‌ కార్యవర్గం భావిస్తోంది. 1,000 డాలర్లు చెల్లించిన వారికి వీసా ఇంటర్వ్యూ వేగంగా ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలిస్తోంది. అతి త్వరలోనే దీనిని అమల్లోకి తీసుకొచ్చే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఓ ప్రణాళికను విదేశాంగశాఖ అంతర్గత మెమోలో ప్రస్తావించారు. దీనిని ఓ అమెరికా అధికారి కూడా ధ్రువీకరించారు. ఈ ప్లాన్‌ను ప్రయోగాత్మకంగా డిసెంబర్‌ నాటికి మొదలుపెట్టే అవకాశం ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి