Breaking News

ట్రిపుల్ ఆర్​ వరకూ వాటర్​బోర్డు..


Published on: 09 Jun 2025 09:51  IST

జంట నగరాల తాగునీటి అవసరాలు తీరుస్తున్న మెట్రోవాటర్​బోర్డు ఇక నుంచి తన పరిధిని మరింత విస్తరించుకునేందుకు సిద్ధమవుతోంది. సీఎం రేవంత్​రెడ్డి ఆదేశాలతో ట్రిపుల్​ఆర్ వరకూ వాటర్​బోర్డు విస్తరించనుంది. ఇందుకోసం అధికారులు యాక్షన్​ప్లాన్​ సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని ప్రాంతాలతోపాటు ఔటర్ రింగ్ రోడ్​లోని మరికొన్ని గ్రామాలకు రోజుకు 550 ఎంజీడీ నీటిని వాటర్ బోర్టు సరఫరా చేస్తున్నది.త్వరలో రోజుకు 160 ఎంజీడీల నీరు అదనంగా అందించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి