Breaking News

కలిసికట్టుగా యోగా డేను విజయవంతం చేద్దాం


Published on: 10 Jun 2025 16:40  IST

విశాఖ వేదికగా జూన్ 21న జరుగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. యోగా దినోత్సవ వేడుకలపై ఈరోజు (మంగళవారం) మంత్రుల బృందం సమీక్ష నిర్వహించింది. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో బీచ్ రోడ్‌లోని సాగరిక హాలులో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా యోగా డేకు సంబంధించి మంత్రి లోకేష్ పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.అందరూ కలిసికట్టుగా పని చేసి విజయవంతం చేయాలని లోకేష్ పిలుపునిచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి