Breaking News

యుద్ధంతో కుప్పకూలుతున్న రష్యా అర్థిక వ్యవస్థ


Published on: 20 Jun 2025 11:44  IST

రష్యా ఆర్థిక వ్యవస్థ సంక్షోభపు అంచుల్లోకి చేరుకుంది. 2022 నుండి ఉక్రెయిన్‌(Ukraine)పై సైనిక దాడితో విరుచుకుపడుతోంది రష్యా(Russia). ప్రస్తుతం రష్యా ఆర్థిక వ్యవస్థ గడ్డు పరిస్థితుల్లో ఉందని దేశ ఆర్థిక మంత్రి మాగ్జిమ్ రెషెట్నికోవ్ తెలిపారు. సెయింట్ పీటర్స్‌బర్గ్(Saint Peter burg) అంతర్జాతీయ ఆర్థిక వేదికలో ఆయన ఈ కీలక విషయాలను వెల్లడించారు. దీనిపై రష్యా త్వరితగతిన చర్యలు తీసుకోకపోతే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందని తర్వాత తిరిగి లేవడం కష్టమని హెచ్చరించారు.

Follow us on , &

ఇవీ చదవండి