Breaking News

భారత్‌కు గర్వకారణంగా నిలిచిన ఈ టీనేజ్‌ షూటర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌కప్‌, అంతర్జాతీయ షూటింగ్‌ వేదికపై డబుల్‌ గోల్డ్‌ సాధించి మరోసారి తన ప్రతిభను చూపిన సురుచి సింగ్‌.


Published on: 17 Apr 2025 12:23  IST

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌ కప్‌లో సురుచి సింగ్‌కి డబుల్‌ గోల్డ్‌

భారత యువ షూటర్‌ సురుచి సింగ్‌ అంతర్జాతీయ షూటింగ్‌ వేదికపై తన ప్రతిభను మరోసారి చాటింది. ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌ కప్‌లో ఆమె రెండు స్వర్ణ పతకాలను తన ఖాతాలో వేసుకుంది.

మొదటిగా మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో వ్యక్తిగతంగా అద్భుతంగా రాణించిన సురుచి, 243.6 పాయింట్లతో ప్రథమ స్థానంలో నిలిచింది. మనూ భాకర్‌ 242.3 పాయింట్లు సాధించి రెండో స్థానం దక్కించుకోగా, చైనాకు చెందిన యావో కియాన్‌గ్జున్‌ కాంస్య పతకంతో సరిపెట్టుకుంది.

తర్వాత మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో సౌరభ్‌ చౌదరితో జతకట్టిన సురుచి, చైనా జోడీపై 17-9 స్కోర్‌తో విజయం సాధించి మరో బంగారు పతకాన్ని గెలుచుకుంది.

ఈ విజయాలతో సురుచి తన మెరిసే భవిష్యత్తుకు దారిని ఏర్పరుచుకుంటోంది. భారత్‌కు గర్వకారణంగా నిలిచిన ఈ టీనేజ్‌ షూటర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement