Breaking News

వచ్చే నెల మూడో వారంలో ఓయూ 84వ స్నాతకోత్సవం


Published on: 18 Jul 2025 18:23  IST

ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ 84వ స్నాతకోత్సవాన్ని వచ్చే నెల మూడో వారంలో నిర్వహించనున్నారు. పట్టాలు, పతకాలు స్వీకరించదలిచిన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ మేరకు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలోకి ప్రవేశించి సంబంధిత రుసుము చెల్లించి తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

Follow us on , &

ఇవీ చదవండి