Breaking News

బరువెక్కిన గుండెలతో కట్టలుతెంచుకుంటున్న ఆగ్రహంతో మళ్లీ సర్జికల్ స్ట్రైక్ చేయాలని కోరుకుంటున్న భారత ప్రజలు.

పహల్గాం ప్రాంతంలో జరిగిన దాడికి సంబంధించి నలుగురు అనుమానిత ముష్కరుల ఫొటోలను బుధవారం అధికారికంగా విడుదల చేశాయి.


Published on: 23 Apr 2025 16:33  IST

జమ్మూ కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిపై నిఘా సంస్థలు తీవ్ర దృష్టి సారించాయి. ఈ దాడికి సంబంధించి నలుగురు అనుమానిత ముష్కరుల ఫొటోలను బుధవారం అధికారికంగా విడుదల చేశాయి. ఇప్పటికే మరో ఉగ్రవాది ఫొటోను కూడా వారు ముందుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఈ దాడికి లష్కరే తోయిబా అనే ఉగ్రవాద సంస్థే బాధ్యత వహించిందని ప్రకటించింది. దానికి నాయకత్వం వహించిన వ్యక్తిగా సైఫుల్లా కసౌరి అలియాస్ ఖలీద్ అనే వ్యక్తిని గుర్తించినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఆయన ఈ దాడికి ముఖ్య సూత్రధారిగా భావిస్తున్నారు. అలాగే రావల్ కోట్ ప్రాంతానికి చెందిన మరో ఇద్దరు వ్యక్తులపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విచారణ ఆ దిశగా సాగుతోంది.దాడికి సంబంధించి మొదట్లో ఊహాచిత్రాలు విడుదల చేసిన అధికారులు, తర్వాత స్పష్టమైన ఫొటోలతో ప్రచారం ముమ్మరం చేశారు.

భద్రతా సమీక్షలో ప్రధాని, హోంమంత్రి చర్యలు

ఈ ఘటన సమాచారం అందుకున్న వెంటనే, విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ హోం మంత్రి అమిత్ షాను అప్రమత్తం చేశారు. వెంటనే అమిత్ షా కశ్మీర్‌కు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాతో భద్రతా పరిస్థితులపై చర్చించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ప్రధాని మోదీ విదేశీ పర్యటనను అర్ధాంతరంగా ముగించి స్వదేశానికి తిరిగివచ్చారు. తిరిగి వచ్చాక జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవాల్, విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌లతో అత్యవసర భద్రతా సమావేశం నిర్వహించారు.

పహల్గాం ప్రాంతంలో భారీ భద్రత

ఉగ్రదాడి జరిగిన పహల్గాం ప్రాంతాన్ని హోం మంత్రి అమిత్ షా స్వయంగా సందర్శించారు. అక్కడ భారీగా భద్రతా బలగాలను మోహరించారు. అమిత్ షా దాడిలో ప్రాణాలు కోల్పోయిన 28 మందికి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబాలను పరామర్శించి, కేంద్ర ప్రభుత్వం తోడుంటుందని భరోసా ఇచ్చారు. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హామీ ఇచ్చారు.

ప్రభుత్వ వర్గాలు ఈ ఘటనను 2019లో జరిగిన పుల్వామా దాడికి తర్వాత మరో పెద్ద ఉగ్రవాద ఘటనగా భావిస్తున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి