Breaking News

రామ్‌కో సిమెంట్‌ పరిశ్రమలో తీవ్ర ఉద్రిక్తత


Published on: 29 Apr 2025 00:27  IST

మండలంలోని రామ్‌కో సిమెంట్‌ పరిశ్రమలో సోమవారం మధ్యాహ్నం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్నది. కల్వటాల గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు క్రిష్ణరంగారెడ్డి రామ్‌కో పరిశ్రమలోని ఓ సబ్‌ కాంట్రాక్ట్‌ కంపెనీ ప్రతినిధి వద్దకు వెళ్లి వర్కులపై చర్చించారు. స్థానికంగా ఉన్న తమకు కాంట్రాక్ట్‌ పనులు కల్పించాలని కోరారు. అయితే సదరు ప్రతినిధి నిర్లక్ష్యంగా, అవమానకర రీతిలో సమాధానం చెప్పడంతో మాటామాటా పెరిగి, ఘర్షణ పడ్డారు. ఇంతలోనే సిబ్బంది టీడీపీ నాయకుడిపై దాడి చేసి గాయపరిచారు. 

Follow us on , &

ఇవీ చదవండి