Breaking News

వెంకటేష్, రాణాకు నాంపల్లికోర్టు షాక్


Published on: 16 Oct 2025 16:01  IST

నాంపల్లి కోర్టులో దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసు విచారణలో భాగంగా నటులు వెంకటేశ్, రానా నవంబర్ 14న కోర్టుకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించింది. పర్సనల్ బాండ్ సమర్పించేందుకు వారు కచ్చితంగా హాజరుకావాలని కోర్టు స్పష్టం చేసింది. ఫిల్మ్‌నగర్‌లోని దక్కన్ కిచెన్ హోటల్‌ను కోర్టు ఆదేశాలను ధిక్కరించి కూల్చివేశారనే ఆరోపణలు దగ్గుబాటి కుటుంబంపై ఉన్నాయి.దగ్గుబాటి కుటుంబం, బౌన్సర్లతో కలిసి తన రెస్టారెంట్‌ను కూల్చివేసి, రూ. 20 కోట్ల నష్టం కలిగించారని లీజుదారు నందకుమార్‌ ఆరోపించారు.ఈ ఆరోపణల నేపథ్యంలో నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు వెంకటేశ్, రానా, సురేశ్ బాబు, అభిరామ్‌లపై కేసులు నమోదయ్యాయి.ఈ కేసు విచారణలో భాగంగానే వెంకటేశ్, రానా కోర్టుకు హాజరు కావాలని ఇప్పుడు నాంపల్లి కోర్టు ఆదేశించింది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement